గతం లో పవన్ తరఫున మీరు పిటిషన్ వేశారు, దాన్ని ఈ న్యాయస్థానం కొట్టివేసింది. మరి ఇప్పుడు కొత్త సమాచారమంటూ మళ్లీ మీరు పిటిషన్ వేశారు. ఇది ఎలా నిలుస్తుంది?’ అని జస్టిస్ భూషణ్ న్యాయవాది ఏపీ సింగ్ ను ప్రశ్నించారు. నిర్భయ దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
నిర్భయ కేసు సమయంలో దోషి పవన్ గుప్తా వయసు 17 సంవత్సరాల ఒక నెల 20 రోజులని అతడి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. అందువల్ల అతడిని జువైనల్‌గా పరిగణించాలని కోర్టును కోరారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో పవన్ జువైనల్ అనే విషయాన్ని దిల్లీ హైకోర్టు పరిగణించలేదని సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసు తీర్పును మరికొద్దిసేపటిలో వెలువరించనున్నారు.
పవన్ పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్ స్పందిస్తూ న్యాయవాదికి పలు ప్రశ్నలు వేశారు.నిర్భయ దోషులపై దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తో ఈ విచారణ జరిగింది.