నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆర్జీయూకేటీ బాసరను సందర్శించారు. క్యాంపస్ పరిపాలన భవనానికి విచ్చేసిన కలెక్టర్ గారికి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ స్వాగతం పలికారు. తదనంతరం కాన్ఫరెన్స్ హాల్ నందు 17 కమిటీల తో కూడిన విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ గత నెల నుండి తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.
విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఉద్యోగులు పరిపాలన అధికారులు ప్రభుత్వ సహకారాలతో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మనిషి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ధైర్యంగా అధిగమించాలని సూచించారు. నూతన ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ చేసే విధంగా మన ఆలోచన విధానం ఉండాలని పేర్కొన్నారు. జిల్లా వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు ప్రొఫైల్ యాప్ రూపొందించాలని కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సూచించారు. ప్రతిభతో రాణించేందుకు తగిన ప్రణాళికలను రచించుకోవాలని పేర్కొన్నారు.
మన ఆలోచన విధానమే మనకు మార్పుకు నాంది పలుకుతుందని సోదాహరణంగా తెలియజేశారు. తదనంతరం స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ లో గల ఆడిటోరియంలో పియుసి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఒకరికొకరుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు కలెక్టర్ మరియు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, వివిధ విభాగాల అధికారులు, ఆర్డిఓ, ఎమ్మార్వో, క్యాంపస్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.