38.2 C
Hyderabad
April 25, 2024 13: 38 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ విశ్రాంత ఎస్పీ కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

#NirmalSP

నిర్మల్ జిల్లా పోలీసు శాఖలో సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేసిన కాలంలో సి.శశిధర్ రాజు చేసిన సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు జ్ఞాపిక అందచేశారు.

శశిధర్ రాజు గత నెలలో పదవీ విరమణ తీసుకున్న విషయం తెలిసిందే. తన పదవీకాలంలో జిల్లాలో ఎన్నో సామాజిక, వైద్య, విద్య, విజ్ఞాన కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. జిల్లాలోని మారుమూల గ్రామాలలో ప్రజలకు కావాల్సిన అవసరలతో పాటు వారికి ఆర్దిక సేవలను అందిస్తూ చదువుకున్న పేద విద్యార్ధులకు జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు.

అనేక వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యం అందచేశారు. అవసరమైన ప్రాంతాలలో CCTV కెమరాలు అమర్చడం, వికలాంగులకు ఆర్దిక సేవలను అందించడం ఇలా తన 35 సంత్సరాల ఉద్యోగ ప్రయాణంలో వేలాది మందికి సేవను అందించారు.

ఆయన సేవలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఒక ప్రత్యేక విభాగంలో గుర్తించింది. అధికారికంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (హైదరాబాద్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ధృవీకరణ పత్రాన్ని, జ్ఞాపికను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మెన్ డా:చింతపట్ల వెంకటాచారిఅందజేశారు.

ఈ సందర్బముగా సి.శశిధర్ రాజు మాట్లాడుతూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తన సేవలను గుర్తించి అవార్డుని ఇవ్వడం ద్వారా సేవాభావం ఇంకా పెరిగిందని అన్నారు.

Related posts

బీజేపీ ప్రతిపాదనలకు నో చెప్పిన పవన్ కల్యాణ్?

Satyam NEWS

317 జీవో సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన

Satyam NEWS

జన హృదయ విశ్వ విజేత జనం మెచ్చిన మహా నేత

Satyam NEWS

Leave a Comment