36.2 C
Hyderabad
April 25, 2024 22: 54 PM
Slider ఆదిలాబాద్

స్టాప్ క్రైం: సామాజిక అంశాలపై అవగాహన కలిగించండి

nirmal sp

మహిళలపై జరిగే నేరాలను ఆపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్ పి సి.శశిధర్ రాజు కోరారు. నేడు ఆయన నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అదే విధంగా కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.

రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చునని ఆయన అన్నారు. యువతకు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ,  విద్య, మూఢనమ్మకాలు, ఆన్ లైన్ ఫ్రాడ్, దొంగతనాలు, చిన్న పిల్లల కిడ్నాపింగ్, ట్రాఫిక్ రూల్స్, ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలిసింగ్, సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు, వాట్సప్ ఫేక్ మెసేజ్ లు, గుడుంబా, సారాకు వ్యతిరేకంగా పోరాటం మొదలైన సామాజిక సమస్యలపై పోలీస్ కళాబృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ డి.ఉపేందర్ రెడ్డి, పట్టణ/గ్రామీణ సి.ఐ.లు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, సొన్ సిఐ జీవన్ రెడ్డి, ఖానాపూర్ సిఐ జైరాం నాయక్, నిర్మల్ సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు.

Related posts

సీసీటీఎన్‌ఎస్‌ ను సద్వినియోగం చేసుకోవాలి

Murali Krishna

పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?

Satyam NEWS

600 బడుల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు

Bhavani

Leave a Comment