28.2 C
Hyderabad
April 20, 2024 11: 22 AM
Slider ఆదిలాబాద్

నేరాల దర్యాప్తులో సాంకేతికతను వాడండి

nirmal sp

పెండింగ్ కేసులు పెరిగిపోకుండా చూడాలని, కేసుల దర్యాప్తులో సాంకేతికతను వాడుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు కోరారు. నేడు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలీసు అధికారికి సి‌సి‌టి‌ఎన్‌ఎస్ లపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఆన్ లైన్ లో కేసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో సులభ మార్గంలో నేరాలను ఛేదించాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లలో 5S లని తప్పక పాటించాలని ఆయన అన్నారు. దొంగతనాల కేసుల్లో ప్రాపర్టీ రీకవరి త్వరగా చేయాలని ఆయన ఆదేశించారు.

సమాచారం ఇచ్చే వనరులను పెంచుకోవాలని, గుట్కా, గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పాఠశాలలు కళాశాలల వద్ద ఆకతాయిలపై షీ టీమ్స్ దృష్టి పెట్టాలి అని అన్నారు. CCTV కెమరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు ఉంటాయన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్ పి శ్రీనివాస్ రావు, డి.యస్.పి లు ఉపేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి.వెంకటేష్, సి.ఐ.లు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి, జైరాం నాయక్, వేణుగోపాల్ రావు, ప్రవీణ్ కుమార్, అజేయ బాబు జిల్లాలోని ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

Related posts

రెడ్డిలను విస్మరిస్తే కేసీఆర్ కు సత్తా చూపిస్తాం

Satyam NEWS

క్రిమిన‌ల్ చ‌రిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోంది

Murali Krishna

పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన చైనా

Satyam NEWS

Leave a Comment