28.7 C
Hyderabad
April 25, 2024 06: 33 AM
Slider ఆదిలాబాద్

మావోలూ మీరంతా లొంగిపోతేనే మేలు

#NirmalPolice

నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సమక్షంలో భాస్కర్ దళం కీలకమైన దళ సభ్యుడు కొడప లింకు స్వచ్ఛందంగా లొంగిపోయాడు.

ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, కొమురం భీం మంచిర్యాల్ డివిజనల్ కమిటీ సెక్రెటరీ మైలవరపు అడెల్లు, భాస్కర్ దళంలో గత మూడు నెలల క్రితం చేరినట్లు తెలిపారు.

అనంతరం దళంలో అనేక కష్టాలు అనుభవించినట్లు కడప లింగు తెలిపినట్టు పేర్కొన్నారు. గత నెలలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దేవుగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నుండి తృటిలో తప్పించుకుని చెల్లాచెదురుగా విడిపోయి, నెల రోజుల పాటు అటవీ ప్రాంతంలో నానా కష్టాలను స్వయంగా అనుభవించి ఎలాంటి భవిష్యత్తు లేని మావోయిస్టుల వ్యవస్థపై విరక్తి చెంది స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోయిడని పేర్కొన్నారు.

దళంలో పని చేయడం నరకయాతన

జనజీవన స్రవంతిలో వెంటనే లొంగిపోయి ప్రజల మధ్య ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని భాస్కర్ కు హితవు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లొంగీ పోయిన దళ సభ్యుడు కొడప లింగు మాట్లాడుతూ మూడు నెలలపాటు భాస్కర్ దళంలో పనిచేయడం ఒక నరకయాతన అనుభవించినట్లు తెలిపారు.

ప్రతిరోజు దుర్భరమైన జీవితం ఉంటుందని, సమయానికి నీరు, భోజనం, వసతి ఉండదని క్షణం క్షణం భయభ్రాంతులతో జీవనం గడపాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి దుర్భరమైన జీవితం బ్రతికే కంటే ప్రజలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండి కష్టార్జితంతో జీవించడం మేలని భావించినట్లు తెలిపారు.

దళం లో పనిచేస్తున్నవారు ఒత్తిడికి గురై అంటున్నారే తప్ప, స్వచ్ఛందంగా ఎవరూ లేరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించి పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నాయని, ప్రతి గ్రామంలో పర్యటించి అన్ని సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో లో శిక్షణ ఐపీఎస్ అధికారి అక్షాంశ్ యాదవ్, ఉట్నూర్ డిఎస్పి ఎన్. ఉదయ్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నవీన్, రెండవ పట్టణ సిఐ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓ సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Satyam NEWS

డెక్కన్‌ క్రానికల్‌ ఎండీ వెంకట్రామ్‌రెడ్డి అరెస్ట్‌

Bhavani

వివేకా హత్య కేసు విచారణలో ఏమిటీ దాగుడుమూతలు?

Satyam NEWS

Leave a Comment