నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులకు గాను 30 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. 7 స్థానాలతో కాంగ్రెస్, 2 స్థానాలతో ఎంఐఎం, 1 స్థానంతో బీజేపీ సరిపెట్టుకున్నది. 2 స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపు సాధించారు.
టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఓటర్లకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 30 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలను ఈ సందర్బంగా ఆయన అభినందించారు.