నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత సంవత్సరం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్, నేడు తన రెండో బడ్జెట్ ను సభ ముందుంచారు. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు ఇవి: వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు.
గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు.
ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు.
స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు.
జల్ జీవన్ మిషన్ కు రూ. 3.06 లక్షల కోట్లు.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ. 6,400 కోట్లు.
ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్ల కేటాయింపు.
విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ. 3 వేల కోట్లు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
కౌలు రైతుల కోసం త్వరలోనే కొత్త చట్టం.
ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా.
పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి.
గ్రామీణ కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ, సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.
గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలు
పంటల దిగుబడిని మరింతగా పెంచేందుకు కృషి.
వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం.
వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం.
రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు.
బీడు భూముల్లో సోలార్ యూనిట్లకు పెట్టుబడి సాయం.
కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన.
ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు.
ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు.
ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు.
పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి.
కరవు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు.
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం.
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రుల నిర్మాణం.
మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 ‘సాగర్ మిత్ర’లు.
ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహకాలు.
కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలతో మరింత ఉపాధి.
మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు.
ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్ ద్వారా కొత్త స్కీమ్ లు.