37.2 C
Hyderabad
April 19, 2024 11: 38 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

దేశ ఆర్ధిక వ్యవ్థకు ఉద్దీపన చర్యలు

nirmala seetaraman

దేశంలో మందగించిన ఆర్ధిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించే విధంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశీ మదుపరులకు విధించాలనుకున్నసూపర్ రిచ్ సర్ చార్జిని ఆమె ఉపసంహరించారు. కారు, ఇల్లు రుణాలను మరింత చౌకగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. గత త్రైమాసికంలో వాహన రంగం ఎన్నడూ లేనంత మందకొడిగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమె దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై రెపోరేటుకు అనుగుణంగానే వడ్డీ ఉంటుందని అందుకు అనుగుణంగానే  వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.  శుక్రవారం సాయంత్రం ఆమె ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి ఆర్ధిక సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నామని, గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని ఆమె వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఆర్ధిక మందగమనంలో ఉందని అందునా అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉందని మంత్రి వెల్లడించారు. జీఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహించి, జీఎస్టీని మరింత సులభతరం చేస్తామని మంత్రి వెల్లడించారు. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఆర్థిక అవకతవకలకు అధిక జరిమానాల రూపంలో శిక్ష ఉంటుందని, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్‌ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాదని ఆమె తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు ఇస్తాం. అసెసీలకు అనుగుణంగానే పన్నుల విభాగం పనిచేస్తుంది. డీఐఎన్‌ లేకుండా ఎలాంటి నోటీసులూ ఉండవు. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. డీఐఎన్‌ లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అధికారీ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు అని మంత్రి తెలిపారు. 

Related posts

వ్యాక్సిన్ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తలే ముఖ్యం

Satyam NEWS

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment