37.2 C
Hyderabad
March 29, 2024 20: 49 PM
Slider జాతీయం

అకస్మాత్తుగా వైదొలగిన నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్

#rajeevkumar

నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ రాజీవ్ కుమార్ రాజీనామా చేసినట్లు విధాన నిర్ణాయక మండలి ఉన్నత వర్గాలు తెలిపాయి. తన రాజీనామా నిర్ణయాన్ని రాజీవ్ కుమార్ ఆయోగ్‌లోని ఇతర సీనియర్‌ నేతలకు తెలిపారని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం తెలియరాలేదు.

రాజీవ్ కుమార్ ఆకస్మిక నిర్ణయం వెనుక గల కారణాలు తమకు తెలియవని అధికార వర్గాలు చెప్పాయి. రాజీవ్ కుమార్ కేబినెట్ మంత్రి హోదాలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2004-2006 సమయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII)  చీఫ్ ఎకనామిస్ట్ గా పని చేశారు.

2011-2013 మధ్యకాలంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సెక్రటరీ-జనరల్ గా ఉన్నారు. రాజీవ్ కుమార్ ఆగస్టు 2017లో నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్‌లలో రెండు పర్యాయాలు మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పనిచేశారు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం (1978) నుండి ఆర్థికశాస్త్రంలో PhD మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1982) నుండి DPhil పొందారు.

Related posts

గుడ్ బై: పవన్ కల్యాణ్ కు మాట నిలకడ లేదు

Satyam NEWS

మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టావా?: పాలవలస యశస్వి

Satyam NEWS

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా గోపీనాథ్

Sub Editor

Leave a Comment