22.7 C
Hyderabad
July 15, 2024 01: 57 AM
Slider సినిమా

నితిన్ రష్మికలతో వస్తున్నచిత్రం భీష్మ

pjimage (12)

నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా కలిసి నటిస్తున్న సినిమా భీష్మ. చలో ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి అభిమానులని ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. టీజర్ కన్నా ముందు ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే బజ్ పెరుగుతుంది కాబట్టే చిత్ర యూనిట్ ఈ ప్లాన్ వేసినట్లు ఉన్నారు. నవంబర్ 7 ఉదయం 10 గంటలకు భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ కుమారుడు మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రష్మిక క్రేజ్ మాములుగా లేదు, సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటిస్తున్న రష్మిక, భీష్మ సినిమాలో ఉండడం ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యే విషయం. చలోని ఫన్ రైడ్ గా మలిచిన వెంకీ కుడుములు, భీష్మని కూడా అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తున్నాడట. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకూ అట్రాక్ట్ చేస్తోందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Related posts

వృద్ధ దంపతులకు సహాయం చేసిన Rti24 news

Satyam NEWS

చెరువుల్ని ఆక్రమించుకున్న వైసీపీ నేతలు

Satyam NEWS

జగనన్న కాలనీ పనులు ముమ్మరం చేయాలి

Bhavani

Leave a Comment