Slider తెలంగాణ ప్రత్యేకం

సచివాలయం కింద నిధి నిక్షేపాలు?

pjimage (7)

ఇప్పుడు ఉన్న సెక్రటేరియేట్ ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉన్నాయా? లభిస్తున్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఇప్పుడు ఉన్న సచివాలయ ప్రాంగణంలోని భూ అంతర్భాగంలో పెద్ద ఎత్తున నిధి నిక్షేపాలు ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలే కాకుండా కొద్ది కాలం కిందట జరిగిన తవ్వకాలలో బయటపడ్డ వస్తువులను పరిశీలిస్తే కూడా ఇది అర్ధం అవుతుంది. సచివాలయం ఉన్న ప్రాంతంలో మరీ ముఖ్యంగా పాడుబడిన జి బ్లాక్ ను నిజాం నవాబుల కాలంలో సైఫా బాద్ ప్యాలెస్ అనే వారు. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ చార్మినార్ దగ్గర పురానీ హవేలీలో నివాసం ఉండేవారు. అయితే ఆయనకు ఒక సారి తీవ్ర మైన అస్వస్థత కలగడంతో ఆయన ప్రశాంత వాతావరణం కోసం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలో ఒక రాజభవనం నిర్మించుకున్నారు. అదే సైఫాబాద్ ప్యాలెస్. ఈ సైఫా బాద్ ప్యాలెస్ ఇప్పుడు సచివాలయంలోని జి బ్లాక్ అన్నమాట.

పాడుపడిపోయిన జీ బ్లాక్ లోనే రహస్యం ఉంది

జి బ్లాక్ ను చాలా కాలంగా నిరుపయోగంగా ఉంచడంతో అది పాడుబడిపోయింది. పిచ్చి మొక్కలతో చెత్తగా మారిపోయింది. దాన్ని పరిరక్షించాల్సిన పాలకులు ఎప్పుడు కూలగొడదామా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు..-సత్యం న్యూస్- సైఫాబాద్ ప్యాలెస్ లో నిజాం నివశించే కాలం లో రక్షణ కోసం భూమి అంతర్భాగంలో కందకాలు నిర్మించారు. ఈ కందకాలలో నిజాం నవాబులు నిధి దాచిపెట్టారు. కోట్లాది రూపాయల విలువగల వజ్ర వైఢూర్యాలు ఇందులో పెట్టారు. శత్రవులు ఎవరైనా దాడి చేస్తే ఈ నిధి నిక్షేపాలను క్షేమంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు భూ అంతర్భాగంలో రహస్య మార్గాలు నిర్మించారు. సైఫాబాద్ ప్యాలెస్ (జి బ్లాక్) నుంచి నౌబత్ పహాడ్ కు ఉన్న రహస్య భూ మార్గం 30 ఏళ్ల కిందట బయటపడింది. నౌబత్ పహాడ్ వద్ద ఒక నిర్మాణం జరిపేందుకు పునాదులు తీస్తుంటే ఈ భూ మార్గం బయటపడింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారం మాటున కప్పి పెట్టారు. అప్పటికీ ఆర్కియాలజీ విభాగం వారు తెలుసుకుని వచ్చి పరిశోధనలు చేశారు. అయితే భూ మార్గం మొత్తం మూసుకుపోయిందని అందువల్ల అది నిరుపయోగమని వారు రిపోర్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ మార్గం జీ బ్లాక్ వరకూ ఉందనేది వాస్తవం.

జీ బ్లాక్ నుంచి ఎన్నో భూ మార్గాలు

అదే విధంగా కింగ్ కోఠీ వరకూ కూడా భూ మార్గం ఉండేది. అంతే కాదు సచివాలయం పక్కన ఉండే మింట్ కాంపౌండ్ కు కూడా భూ మార్గం ఉంది. కొద్ది కాలం కిందట మింట్ కాంపౌండ్ లో నిర్మాణాలు జరుపుతుండగా ఈ భూమార్గం బయటపడింది. ఇందులో నిజాం నవాబు కు చెందిన నిధి నిక్షేపాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికీ మింట్ కాంపౌండ్ లో ఆరవ నిజాం కు చెందిన నిధి ఉన్నట్లు చెబుతారు. ఈ నిధిని వెలికి తీశారో లేదో తెలియదు. వజ్ర వైఢూర్యాలు బంగారు నగలు ఇందులో ఉండేవని కూడా అప్పటిలో అనుకున్నారు. అదే విధంగా హోం సైన్స్ కాలేజీ వద్ద కూడా ఒక రహస్య సొరంగం బయటపడింది. ఇందులో నిజాం నిధి దొరికింది కూడా అయితే దీన్ని కూడా దాచిపెట్టారు..-సత్యం న్యూస్- బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. నిజాం నిధి ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి రహస్యాలు సచివాలయం అంతర్భాగంలో ఎన్నో ఉంటాయి. మరీ ముఖ్యంగా జీ బ్లాక్ కూలగొడితే ఇవన్నీ బయటపడతాయి. ఇందులో నిజాం నవాబుకు చెందిన అత్యంత విలువైన సంపద బయటపడేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచి సచివాలయంలోకి ఎవరూ వెళ్లేందుకు అవకాశం లేదు. చుట్టూ పెద్ద పెద్ద రేకులు అడ్డం పెట్టి కూలగొట్టడం, నిర్మాణ పనులు చేస్తుంటారు. బయటకు ఏమీ కనిపించే అవకాశం లేదు. జీ బ్లాక్ కూలగొట్టిన తర్వాత ఏమీ లేదు అని అన్నా మనమందరం నమ్మాల్సిందే తప్ప వేరే గత్యంతరం ఉండదు.

నిధులు బయటపడ్డా తెలియనివ్వరు

ఎందుకంటే ఇలాంటి తవ్వకాలలో ఏవైనా నిధి నిక్షేపాలు బయట పడితే అది ఎవరికి దక్కాలనే ప్రశ్న ఉదయిస్తుంది. అంతే కాదు ఇలాంటి సొరంగ మార్గాలు, అద్భుతమైన నిర్మాణాలు భూ అంతర్భాగంలో ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. నిధి నిక్షేపాలు ఉన్నాయంటే నిజాం వారసులు ఎగబడతారు. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే ఇలాంటివి బయట పడినా కూడా ఎంతో గుంభనంగా ఉంచుతారు. నౌబత్ పహాడ్, మింట్ కాంపౌండ్, కింగ్ కోఠీ తవ్వకాలలో భూ మార్గాలు బయటపడినప్పుడే వాటిని దాచిపెట్టేశారు. గుంభనంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు చెబుతారా? చెప్పరు గాక చెప్పరు. అక్కడ నిధి నిక్షేపాలు బయటపడితే అవి ప్రయివేటు పరం కాక తప్పదు. నిజాం సంపద అనంత పద్మనాభ స్వామి సంపద కన్నా రెట్టింపు ఉండేది. అయితే అదంతా నేలమాళిగలలో నిక్షిప్తం అయిపోయింది. ఇప్పుడు సచివాలయం పునర్ నిర్మాణం కారణంగా అవి బయటకు వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఎవరూ బయటకు చెప్పరు. ఉష్…. అంతా గప్ చుప్.

Related posts

పారిశుద్ధ్య కార్మికులూ మనుషులే.. అంటూ కరోనా సమయంలో సాయం…!

Satyam NEWS

రుణమాఫీ కోసం 18,241.94కోట్లు విడుదల

Bhavani

అధికారంలో ఉన్నా లేకున్నా ఆపన్నుల్ని ఆదుకుంటాం

Satyam NEWS

Leave a Comment