39.2 C
Hyderabad
April 25, 2024 15: 40 PM
Slider తెలంగాణ

అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ

arivind

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదిహేను నిమిషాల పాటు ఢిల్లీ, నార్త్ బ్లాక్ లోని అమిత్ షా కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ లో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, నిజామాబాద్ రైతుల సమస్యలు, ఈ భేటీ లో చర్చకు వచ్చాయి. పసుపు పంటకు సంబంధిచి అనేక విషయాలను ఈ సందర్బంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి ద్వారా అమిత్ షా కనుక్కున్నారు. 1987 లో మసాలా బోర్డ్ లో పసుపు కలిపినప్పుడు కూడా పసుపు ను మసాలా లాగా కాకుండా యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్ గానే వాడేవారని, ఇప్పుడు క్యాన్సర్, అల్జీమర్స్, టీబీ, వాపుల కు కూడా వాడుతున్నారని చెప్పారు. పసుపును మనం వంటల్లో వాడుతున్నాం కాబట్టే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే కొలన్ క్యాన్సర్ భారతదేశంలో తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో 85 శాతం పసుపు మన దగ్గరనే పండుతోందని, పసుపును ప్రమోట్ చేయాల్సిన అంశంతో పాటూ ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు అమిత్ షా.

Related posts

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి మహరాజ్ అనుమానాస్పద మృతి

Sub Editor

సిఆర్‌పిఎఫ్ సైకిల్ ర్యాలీ ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

Satyam NEWS

స్పీడు మీద ఉన్న విక్టరీ వెంకటేష్

Satyam NEWS

Leave a Comment