36.2 C
Hyderabad
April 23, 2024 20: 19 PM
Slider తెలంగాణ

పసుపు మద్దతు ధరకు ఏకగ్రీవ తీర్మానం

nzb arvind

పసుపుకు మద్దతు ధర ఇవ్వ వలసిందేనని పసుపు రైతుల సమస్యలను తీర్చడానికి వేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్   సమావేశం  ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిజామాబాద్  లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన తొమ్మిది రాష్ట్రాల స్పైస్ బోర్డు, హార్టీకల్చర్,   కామర్స్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు, సైంటిస్ట్ లు పాల్గొన్న ఈ  మీటింగ్ లో ఎంపీ అర్వింద్ ధర్మపురి ఈ ఏకగ్రీవ తీర్మానం చేయించడంలో కీలక పాత్ర పోషించారు. స్పైసెస్ బోర్డు  1987 లో ఏర్పడ్డప్పుడు పసుపు ను అందులో పెట్టడం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం అని  ఈ సందర్భంగా ఆయన అన్నారు. పసుపు ను కూరల్లో వేసుకునేది  రుచి కోసం కాదు  బ్యాక్టీరియాలను చంపడం కోసం అన్న ఇంగిత జ్ఙానం కూడా అప్పటి కాంగ్రెస్ సర్కార్ కు లేదన్నారు. 1981 లో కొబ్బరి బోర్డును ఏర్పాటు చేసినప్పుడు  మరి కొబ్బరిని ఎందుకు సుగంధద్రవ్యాల బోర్డులో కలపలేదని,  కొబ్బరిని కూడా కూరల్లో వేస్తారు కదా అని ప్రశ్నించారు. కేరళ కాంగ్రెస్ నాయకులు సాధించుకున్నది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చేయలేకపోయారని గుర్తుచేశారు.  కొబ్బరికి బోర్డు ఉండి, మద్దతు ధర ఉండి కూడా ఎగుమతి విలువ రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేదని, అదే  పసుపునకు ఎలాంటి బోర్డు లేకుండా, ధర లేకున్నా 32 సంవత్సరాలుగా  పూర్తిగా నిర్లక్ష్యం చేసినా కూడా  మార్కెటింగ్ లో సపోర్ట్ లేకపోయినా కూడా  1200 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు.  మన దగ్గర నుండి  టెక్నాలజీ నేర్చుకున్న వియత్నాం మన దేశానికే 320  కోట్ల  ఎగుమతి చేస్తుందంటే  అది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. అల్జీమర్స్, క్యాన్సర్,వాపులు, టీబీ , మెదడుకు సంబంధించిన ఇతర జబ్బులు లాంటి వాటిని నయం చేస్తుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కోలన్ క్యాన్సర్ కూరల్లో పసుపును వాడతారు కాబట్టే తక్కువుగా ఉంటుంది. ఇలాంటి పుసుపు ఇన్ని సంవత్సరాలుగా మసాల బోర్డు లో పెట్టడం అంటే అది భారత దేశ ఖ్యాతికే మచ్చ అన్నారు. విత్తిన సరఫరా సరిగా లేకపోవడం , రైతులకు అవగాహన కల్పించకపోవడం  మార్కెటింగ్ లో ఎలాంటి సహాయం, మద్దతు లభించక  పసుపు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ఈ సమావేశం అభిప్రాయ పడింది.  యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించడం, డిమాండ్ కు తగ్గట్టు పంట పండించడం, కర్కుమిన్ ను పెంచడం,  కోల్‌ స్టోరేజ్ లు పెంచడం లాంటి సమస్యల పరిష్కారం దిశగా  ఈ సమావేశం ఉపయోగపడింది. 52 దినుసులు ఉన్న మసాల బోర్డులో  పసుపు ఉండటం వల్లనే ఇబ్బంది అని, పసుపు కు ప్రత్యేక  బోర్డు ఏర్పాటే  దీనికి పరిష్కారం అని  ఎంపీ అర్వింద్ ధర్మపురి అనడంతో మెజారిటీ అధికారులు  ఎంపీ కి మద్దతు తెలిపారు

Related posts

ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన డిఏలు కనుకలా?

Satyam NEWS

కేసీఆర్ అవినీతిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS

త్వ‌ర‌లోనే బాస‌ర ఆలయ పునర్నిర్మాణం

Satyam NEWS

Leave a Comment