ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల మిలియన్ మార్చ్ చలో ట్యాంక్ బండ్ కు బీజేపీ పూర్తి మద్దతునిచ్చింది. అందులో భాగంగా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన ఇంటి నుండి బయలుదేరే సమయంలో బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కె ఎస్ రావు, ఇన్స్పెక్టర్ కళింగరావు, ఎస్సై శ్రీనివాస్ లు హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల కు సంఘీభావంగా వెళ్తోన్న తనను ఇలా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎంపీ అర్వింద్ ధర్మపురి తీవ్రంగా ఖండించారు. ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఇంటి ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
previous post