28.2 C
Hyderabad
April 20, 2024 11: 51 AM
Slider నిజామాబాద్

నో అబార్షన్ ప్లీజ్: ఆడపిల్లను చంపితే శిక్ష గ్యారెంటీ

sunju reddy

స్కానింగ్ ద్వారా గర్భంలో అమ్మాయా అబ్బాయా అని తెలుసుకొని అమ్మాయి అయితే కొందరు గర్భవతులు అబార్షన్ చేయించుకుంటున్నారని, ఇలా చేయడం వల్ల శిక్షపడుతుందని కామారెడ్డి జిల్లా ఆరోగ్య బోధకులు సంజు రెడ్డి అన్నారు. ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్ చేసుకున్నా, చేయించినా చేసిన బేటి బచావో బేటి పడావో పిసి యాక్టు ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు.

పి సి, టి ఎన్ డి టి అనుసరించడం  ద్వారా సమాజంలో జరుగుతున్న  మాతృ మరణాలు, శిశు మరణాలు  నియంత్రించడానికి వీలు పడుతుందని లింగవివక్ష చూపించ రాదని సంజు రెడ్డి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గర్భిణులకు అందిస్తున్న సేవలను బిచ్కుంద మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంను ఆయన పరిశీలించారు.

గర్భిణీ నమోదు, ఫీల్డ్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్ తదితర రిజిస్టర్లు పరిశీలించారు. కొత్తగా పెళ్లైన జంటలను గుర్తించి పంచాయతీ కార్యదర్శి ద్వారా వివాహ నమోదు చేయించాలని, అంగన్వాడి కేంద్రంలో మూడు నెలల లోపు పిల్లల నమోదు, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతిరోజు ఆకుకూరలు, పప్పు, సాంబార్ భోజనం, 200 మిల్లీ లీటర్ల పాలు ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలని,  గర్భిణుల బరువు ప్రతి నెల రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు.

ఆరోగ్య పథకం ద్వారా పాలిచ్చే తల్లులకు పోషకాహారంతో  కూడుకున్న భోజనం అంగన్వాడీ కేంద్రంలో ఇవ్వాలని అన్నారు.  మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మొదటి బిడ్డ కాన్పు నుండి రెండో బిడ్డ గర్భధారణకు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల అంతర్యం ఉండేలా ఐ వి సి డి, అయ్యూ డి, అంతర ఇంజక్షన్, నిరోద్, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను వాడేలా దంపతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆరోగ్య కార్యకర్తకు సూచించారు.

హైరిస్క్ ఉన్న గర్భిణులను వెంటనే జిల్లా ఆస్పత్రికి పంపించి మెరుగైన చికిత్సలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలనరు. ఆయన వెంట బాన్సువాడ డివిజన్ ఆరోగ్య బోధకులు దస్తీ రామ్, ఆరోగ్య కార్యకర్త ఫ్లారెన్స్, అంగన్వాడీ కార్యకర్త అనసూయ, ఆశ కార్యకర్త సుమలత, గర్భిణీలు ఉన్నారు.

Related posts

పొలంలో నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Bhavani

మహాశివరాత్రి ప్రత్యేకం….. శివ పూజకు మార్గాలెన్నో…

Satyam NEWS

జల్సాల కోసం చోరీలు చేసిన నిందితుడు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment