28.7 C
Hyderabad
April 20, 2024 08: 19 AM
Slider తెలంగాణ సంపాదకీయం

మొక్కుబడి చర్చలు తప్ప ఫలితం లేదు

TSRTC

హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పై మొక్కుబడిగా చర్చలు జరిపి ముగించారు. కేవలం హైకోర్టుకు సమాధానం ఇవ్వడం కోసం తప్ప ఆర్టీసీ సమ్మె ను పరిష్కరించే దిశగా చర్చలు జరగలేదు. హైకోర్టు చర్చలు జరపాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ బాధ్యతను ఆర్టీసీ యాజమాన్యం చూసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పినపుడే ప్రభుత్వం చర్చల నుంచి తప్పుకున్నట్లు స్పష్టమైపోయింది.

అదే విధంగా ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంతో విలీనం ను పూర్తిగా పక్కకు తప్పించేందుకు కూడా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా హైకోర్టు ఆదేశించజాలదని ప్రభుత్వం చెప్పింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం హైకోర్టు కు ఈ అంశంతో సంబంధంలేదని పరోక్షంగా సంకేతాలివ్వడం కొత్త విషయమే. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  హైకోర్టు 21 అంశాలపై చర్చలు జరపాలని చెప్పిందని, ఆ విధంగానే తాము కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపామని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చెబుతున్నారు.

తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన నేతలు ఇప్పటి వరకు రాలేదని పేర్కొన్నారు. జేఏసీ నేతలతో చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం ఎర్రమంజిల్‌ ఈఎన్‌సీ కార్యాలయం వద్ద ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కార్మికులతో గంటన్నరపాటు చర్చలు జరిగాయని సునీల్‌ శర్మ తెలిపారు. 21 అంశాలపై చర్చిద్దామని తాము చెప్పామని, అన్ని డిమాండ్లపై చర్చించాలని కార్మిక సంఘాలు కోరాయని పేర్కొన్నారు.

ప్రభుత్వంలో విలీనం మినహా మిగతా వాటినే చర్చిస్తామంటే కార్మిక నేతలు అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. తమ వాళ్లతో మాట్లాడి వస్తామని జేఏసీ నేతలు మధ్యలోనే వెళ్లిపోయారని, సాయంత్రం 6.30 గంటల వరకు వేచి చూసినా వాళ్లు తిరిగి రాలేదని చెప్పారు. ఈ విధంగా మాట్లాడటం అంటేనే ఆర్టీసీ యాజమాన్యం చర్చలు సిద్ధంగా లేదనే విషయం అర్ధం అవుతున్నది.

జేఏసీ తరఫున 26 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచితే కేవలం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని చెప్పారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. చర్చలు జరిగిన తీరుపై తాము గర్హిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని జేఏసీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, మళ్లీ పిలిస్తే హాజరవుతామన్నారు.

26 డిమాండ్లపై చర్చలు జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. భేటీ అనంతరం జెఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ఈ చర్చలను నిర్బంధ చర్చలుగా అభివర్ణించారు. ఇలాంటి చర్చలు ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమ సెల్‌ఫోన్లు లాక్కుని చర్చలు ప్రారంభించారని ఆరోపించారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తుంటే ఆర్టీసీ సమస్య మరింత కాలం కొనసాగే విధంగా కనిపిస్తున్నది. ఈ లోపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూనే ఉన్నది.

Related posts

హరీష్ వ్యూహం : కాంగ్రెస్ కు షాక్ కారెక్కిన టి పి సి సి కార్యదర్శి జగపతి

Satyam NEWS

కటిక దరిద్రం అనుభవిస్తున్నాయా ఈ కార్పొరేట్ కాలేజీలు?

Satyam NEWS

ఎంపీ నిధులతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment