31.2 C
Hyderabad
April 19, 2024 04: 19 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో బర్డ్ ప్లూ ఆనవాలు లేవు…ఆందోళన వద్దు

#TalasaniSrinivasayadav

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాలు లేవని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  వెల్లడించారు. అందువల్ల రాష్ట్రంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

బర్డ్ ప్లూ వైరస్ నివారణ కు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల పై ఉన్నతస్థాయి అధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, VBRI అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

 ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో 1300 అధికారుల బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.

కోళ్ళ పరిశ్రమలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ౩ వ స్థానంలో ఉంది. అన్ని స్థాయిలలోని అధికారులను అప్రమత్తం చేశారు. రాజస్తాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లో మాత్రమే బర్డ్ ఫ్లూ ను గుర్తించారు.

Related posts

డైజెస్ట్:మందలింపుతో కొడుకు మృతి బాధతో తల్లి మరణం

Satyam NEWS

కరోన పట్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలి

Satyam NEWS

క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

Leave a Comment