30.7 C
Hyderabad
April 16, 2024 23: 21 PM
Slider హైదరాబాద్

ఆన్ లైన్ క్లాసుల పేరుతో వేధిస్తున్న కార్పొరేట్ కాలేజీలు

#SFI Medchal

ఆన్ లైన్ క్లాసులు పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పడాల శంకర్ డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో తల్లిదండ్రుల  ఆర్ధిక ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెడుతున్నాయని ఆయన అన్నారు.

మేడ్చల్ జిల్లా , ఘట్కేసర్ మండలంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు పేరుతోనే విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులకు ఫోన్లు మెసేజ్ లు పంపిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వ అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని,  పాఠశాల విద్యా శాఖ ఇప్పటివరకు విద్యా ప్రణాళిక గురించి ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. విద్యాశాఖ ప్రణాళిక లేకుండా 2020-21 విద్యా సంవత్సరాన్ని ఏ విధంగా కొనసాగిస్తారో  స్పష్టత లేదని ఆయన అన్నారు.

ఆన్లైన్ క్లాసులు పై ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన చేసినా కిందిస్థాయి అధికారులు మాత్రం స్పందించి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కు అయినట్టుగా అర్థమవుతుందని ఆయన తెలిపారు.

డిగ్రీ సెమిస్టర్ ఫీజు కూడా ప్రభుత్వమే భరించాలని కార్పొరేట్లకు వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నా ప్రభుత్వం భావి భారత పౌరులకు ఎందుకు చెయ్యట్లేదు అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పోరాటానికి సిద్ధం కాబోతుందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒత్తిడి గురి చేస్తే సహించేది లేదని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలి, ఒత్తిడి చేయడం మానేస్తే మంచిదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉపేందర్ అధ్యక్షుడు హిమ వర్ధన్ నాయకులు అనిల్  పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి కి త్వరలో కే‌సి‌ఆర్

Murali Krishna

చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అపచారం

Satyam NEWS

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Bhavani

Leave a Comment