ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) హత్య కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సురేష్ వద్దకు తరచూ ఒక యువకుడు వచ్చేవాడని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. సురేష్ అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. 48 గంటలు గడిచినా.. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సురేష్ కాల్‌డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాధమిక విచారణలో సురేష్ ది హత్యగా పోలీసులు తేల్చారు. పోస్ట్‌మార్టం పూర్తి అయ్యాక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య, కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు
previous post
next post