28.7 C
Hyderabad
April 20, 2024 07: 05 AM
Slider ఖమ్మం

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

#Minister Puvvada Ajay

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టు లో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పోరాడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై అవగాహన ,సమాచారం లేని వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు.

పోతిరెడ్డి పాడు పై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా, తెలంగాణ బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడటం జాతీయ పార్టిగా చెప్పుకునే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. బుధవారం ఖమ్మం వీడిఓస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంతో మంత్రి మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ నిర్ణయం అభ్యంతరకరం

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ పోతిరెడ్డిపాడు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆయా ప్రక్రియ చేపట్టారని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా పేర్కొన్నారు.

ఇప్పటికే ఫిర్యాదు చేశాం

ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేయడం సరికాదన్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని  కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేశాం అని స్పష్టం చేశారు. గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించింది.

బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పారు.  అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,  రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, DCMS చైర్మన్ శేషగిరిరావు, AMC చైర్మన్ వెంకట రమణ పాల్గొన్నారు.

Related posts

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Bhavani

ఆసుపత్రి పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే షిండే

Satyam NEWS

అత్యాచారం నుంచి కాపాడిన డయల్ 100

Satyam NEWS

Leave a Comment