32.2 C
Hyderabad
March 28, 2024 22: 54 PM
Slider ప్రత్యేకం

గుడ్ న్యూస్: తిరుమలకు కరోనా వైరస్ రాలేదు

tirumala tirupathi

ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన 130 మంది భక్తులు తీర్థయాత్రలో భాగంగా అలహాబాద్,  వారణాసి, కలకత్తా, పూరిల మీదుగా ఒంగోలు చేరుకుని, శ్రీశైలం వెళ్లి నిన్న మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో ద‌యాశంక‌ర్ అనే 65 ఏళ్ల వృద్ధిడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తిరుపతి రూయాకు తరలించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఈ విషయం వెల్లడి కావడంతో తిరుమలకు వెళ్లే దోవలన్నీ మూసేశారు. అలిపిరి వద్దే భక్తులను నిలిపివేశారు. అయితే ఆ తర్వాత అతనికి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఊపిరి పీల్చుకుంది.

అయితే టిటిడి అధికారులు భక్తుల పట్ల అలసత్వం వహించారని సోషల్ మీడియాలో కొందరు చేసిన దుష్ప్రప్రచారంపై కేసు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ కు కరోనా పరీక్షలో నెగిటివ్ రావడంతో దయా శంకర్ తో పాటు మరో 109 మంది భక్తులకు ఉపసమనం కలిగినట్లయింది.

అత‌నికి గ‌త 20 సంవ‌త్స‌రాలుగా క్రానిక్ అబ్ట్స్ర‌క్టివ్‌ పల్మనరీ డిసీజ్ ( సిఓపిడి ) దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న‌ట్లు వైద్యులు తెలియ‌జేశార‌న్నారు.  

Related posts

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి:కలెక్టర్ షేక్

Satyam NEWS

2023 డిసెంబరుకు రామాలయ నిర్మాణం పూర్తి

Murali Krishna

బిచ్కుందలో భాజా భజంత్రీల మధ్య గణపయ్య నిమజ్జనం

Satyam NEWS

Leave a Comment