26.2 C
Hyderabad
September 23, 2023 10: 59 AM
Slider ఆంధ్రప్రదేశ్

సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్

Jagan review

గోదావరి వరదల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయలో ఆలస్యం చేయవద్దని అధికారులకు మరోసారి స్పష్టంచేశారు. విదేశీ పర్యటనను ముగించుకున్న తర్వాత సీఎం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణం, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధవళేశ్వరం వద్ద 2,3 ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇప్పుడు ఒకటో ప్రమాద స్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి కారణాలేంటో అధ్యయనం చేయాలని, తర్వాత తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆతేశించారు. గడచిన 5–6 రోజుల్లోనే 500 టీఎంసీల జలాలు గోదావరి నదిద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనావేశామన్నారు. వచ్చే 2 రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండడంవల్ల ఈ పరిస్థితి ఉంటుందన్నారు.గోదావరి పరీవాక ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు లేవని, వచ్చే వారంరోజులపాటు కూడా వర్షసూచన లేదని సీఎంకు చెప్పారు. 3రోజుల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వివరించారు.వరద బాధిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని సీఎం పునరుద్ఘాటించారు. సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలుతీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయాలన్నారు. గునీటికి ఎలాంటి కొరత లేకండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related posts

సిఏఏ, ఆర్టికల్ 370 పై సౌదీలో ఇస్లామిక్ దేశాల మీటింగ్

Satyam NEWS

హైదరాబాద్ కు ప్రారంభమైన విమానాల రాకపోకలు

Satyam NEWS

బ్లెసింగ్ గాస్పెల్ మిసిస్ట్రీస్ చర్చి ప్రారంభం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!