వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నేడు అసెంబ్లీలో ఎస్సీ ప్రత్యేక కమిషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం లా సింగిల్‌గా వెళ్తాడు తప్ప పొత్తుల కోసం వెళ్లరని మంత్రి అన్నారు. పొత్తులు లేకుండా టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదని, ఏ పార్టీతో కలుద్దామా అని టీడీపీ ఆలోచిస్తుందని అనిల్ ఎద్దేవా చేశారు. నెక్ట్స్ తెలుగు దేశం పార్టీ ఏ పార్టీ చంకన ఎక్కుతుందో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు.