30.2 C
Hyderabad
September 14, 2024 15: 26 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

బిఆర్కే భవనం లోనికి మీడియాకు నో ఏంట్రీ

brk

తెలంగాణా రాష్ట్ర తాత్కాలిక సచివాలయం లోనికి మీడియా ను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఎవరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పొలిసు సిబ్బంది ఈ విషయాన్ని కుండా బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ రాజకీయ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి (జీఏడీ పొలిటికల్ ) ఈ మేరకు మౌఖిఖంగా ఆదేశాలు జారీచేశారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మీడియాకు చెందిన కంట్రిబ్యూటర్ నుంచి బ్యూరో ఇంచార్జి వరకూ,ఫొటోగ్రాఫర్ నుంచి కెమారా మెన్ వరకూ ఎవరిని అనుమతించవద్దుని స్పష్టమైన ఆదేశాలు అందాయని పోలీసులు చెబుతున్నారు. తమ వ్యక్తిగతమైన పనులమీద వస్తున్నామని చెప్పినా మీరేదయినా రాస్తే మాకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా సచివాలయం లో జరిగే సమీక్షలు సమావేశాలు వివరాలను మీడియాకు అందించే పబ్లిసిటీ సెల్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశం లోను ఇప్పటివరకూ స్పష్టతలేదు. ప్రస్తుతం డి బ్లాక్ లో ఉన్న ఈ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ ఆధ్వ్యర్యంలో పని చేస్తోంది. ఈ బ్లాక్ లో ఉన్న కార్యాలయాలు అన్ని ఒక్కటిగా తరలి పోతున్నాయి. పబ్లిసిటీ సెల్ మాత్రం ఎక్కడికి వెళుతుందో అక్కడ పనిచేసే అధికారులకు,సిబ్బందికి సమాచారం లేకపోవడంతో వాలారు మౌనం గా తమ పని చేసుకుపోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం కు సంబంధించిన వార్తలును ఇదే కార్యాలయం నుంచి పంపించారు. సమాచార శాఖ సాధారణ పరిపాలన కిందకు వస్తుంది. ఈ శాఖ కమిషనర్ ప్రభుత్వరీత్యా కార్యదర్శి గా కొనసాగుతారు.దీనితో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి,ఇతర ముఖ్య అధికారులకు కేటాయించిన చోటే వీరికి కేటాయించాలి. ఏం చేస్తారో తెలియదు.

Related posts

6 గ్యారెంటీలు అమలు చేస్తాం

Satyam NEWS

చలికాలంలో హాట్ గా పంజాబ్‌ పాలిటిక్స్

Sub Editor

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment