తాగటానికి నీరు, తినటానికి తిండి కూడా లేకపోవటంతో రంగారెడ్డిజిల్లా కోహెడ పండ్ల మార్కెట్ రైతులు తీవ్రంగా బాధపడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నేడు ఆయన కోహెడ మార్కెట్ ను సందర్శించారు. కనీస సౌకర్యం లేని ప్రాంతంలోకి పండ్ల మార్కెట్ ని తరలించటానికి మంత్రులకు బుద్ధి ఉండాలని ఆయన అన్నారు.
ఇక్కడ వ్యాపారస్థుల, రైతులు తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన అన్నారు. కోహెడ లో పండ్ల మార్కెట్ కి కాంగ్రెస్ హయాంలోనే శ్రీకారం చుట్టామని, మొత్తం 170 ఎకరాల లో మార్కెట్ ప్లాన్ చేశామని ఆయన అన్నారు.
వసతులు పూర్తి కాకుండానే హడావుడిగా పండ్ల మార్కెట్ ని తరలించారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం నుంచి పండ్ల మార్కెట్ ని అకస్మాత్తుగా తరలించటానికి కారణం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కొత్త మార్కెట్ 22 ఏకరాలపై కేసీఆర్ కన్ను పడిందేమోఅనే అనుమానం వ్యక్తం అవుతుందని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
2000 మందికి భోజనాలు, బస్సు సౌకర్యాలు కలిపిస్తామని చెప్పి మంత్రులు మాయం అయిపోయారని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి పండ్ల మార్కెట్ కి వస్తున్న వారికి కరోనా టెస్టులు చేయటం లేదని ఇది ప్రమాదానికి దారితీస్తుందని ఆయన హెచ్చిరించారు.