35.2 C
Hyderabad
April 24, 2024 11: 07 AM
Slider జాతీయం

కొత్త వేరియంట్ పై ఫేక్ ప్రచారాలు వద్దు

#covid

కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాల కంటే అసత్యప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదకరమైన ఎక్స్ బీబీ వేరియంట్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో వచ్చిన సమాచారం కలంకలం సృష్టించింది. ఈ సమాచారం నకీలీదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమాచారం ఇంకా అందరికీ చేరాల్సిన వుంది. ఇటువంటి ఫేక్ వార్తలను ఖండిస్తూ నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పండుగల వేళ అందరూ ఆనందంగా గడుపుతున్న తరుణంలో అమ్మో! మళ్ళీ వైరస్ అంటూ కొందరు భయపెట్టే మెసేజెస్ పెడుతున్నారు.

భయాందోళనలతో బెంబేలెత్తవద్దు

వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండడం ఎంత ముఖ్యమో అనవసర భయాలతో బేంబేలెత్తకుండా ఉండడం అంతే ముఖ్యం. ఎక్స్ బీ వేరియంట్ కు సంబంధించి ఇప్పటి వరకూ వైరల్ గా మారిన సమాచారం మొత్తం తప్పని తెలుస్తోంది. ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ఇదివరకే పేర్కొంది. దీని ప్రమాద స్థాయి డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువేనని తెలిపింది. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో, చైనా విజృంభణకు బీ ఎఫ్ 7 కారణం కాదని ఈ నివేదికలు అంటున్నాయి. భారతదేశంలో అర్హులైన వారిలో 95శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో లాక్ డౌన్ విధించే పరిస్థితులు రావని, చైనీస్ కంటే భారతీయల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని ఐఎంఏకు చెందిన డాక్టర్ అనిల్ గోయల్ వివరించారు.

మాస్క్ తప్పని సరి

బీఎఫ్ 7 కేసులు మన దేశంలోనూ స్వల్పంగా నమోదయ్యాయి. టెస్టింగ్,ట్రీటింగ్,ట్రేసింగ్ విధానాలను తప్పకుండా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం,శానిటైజర్లు వాడడం, భౌతికదూరం పాటించడం వంటి కోవిడ నిబంధనలు పాటించడం కీలకం.విదేశీ ప్రయాణికులపై నిఘాను కట్టుదిట్టం చెయ్యాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు గతంలో ‘ఎయిర్ సువిధ’ పేరుతో ప్రవేశపెట్టిన నిబంధనలను మరోసారి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్టీ -పీసీఆర్,వ్యాక్సినేషన్ ప్రూఫ్ మొదలైనవి దీనికి కిందకు వస్తాయి.వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు సెల్ఫ్ డిక్లరేషన్ గా ఇవ్వాలి.

భారత్ లో గడిచిన 20రోజుల్లో సుమారు 200లోపే కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాస్కు పెట్టుకొని రాజ్యసభకు హాజరై,అందరూ మాస్క్ ధరించాలనే సందేశాన్ని,సంకేతాన్ని ఇచ్చారు. ముఖ్యంగా రద్దీల్లో ఉంటే మాస్క్ ధరించడమే శ్రేయస్కరం.

ఇప్పటికే కరోనా తన స్వభావాన్ని మార్చుకుంటూ అనేక రూపాలను ఎత్తింది.జీనోమ్ స్వీక్వెన్స్ ను అధ్యయనం చేయడం ద్వారా వేరియంట్స్ ను గుర్తించవచ్చు. శానిటైజేషన్ కూడా ముఖ్యం. ప్రీకాషస్ డోసుల కవరేజ్ ను పెంచడంతో పాటు అవగాహన కూడా పెంచాలి.కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అతిగా అలోచించడం అనవసరం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌

Sub Editor

‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’

Bhavani

వంటగ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేక నిరసనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment