34.2 C
Hyderabad
April 19, 2024 21: 10 PM
Slider ముఖ్యంశాలు

సంక్రాంతి ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

apsrtc 2

ఆంధ్రా ప్రభుత్వం సంక్రాంతికి ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణీకులను దోచుకుంటుంటే తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతికి ఎలాంటి పెంపు లేకుండా సర్వీసులు నడుపుతున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దాంతో ఏపి, తెలంగాణ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించబడంతో పల్లెలకు వెళ్లేందుకు పట్నం వాసులు సిద్ధమవుతున్నారు. తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో ప్రజలు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. ఇక సోంతుళ్లకు వెళ్లే వారితో నగరంలో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన్నట్లు అధికారులు వెల్లడించారు. అదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉండనుందన్నారు.

Related posts

పన్ను విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల వినతి పత్రం

Satyam NEWS

బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్

Satyam NEWS

అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదు

Satyam NEWS

Leave a Comment