31.2 C
Hyderabad
April 19, 2024 03: 56 AM
Slider విజయనగరం

ఇత‌రుల‌కేనా..నీతులు…మ‌రి మీకో…!

#VijayanagaramCollector

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ప్ల‌వ నామ సంద‌ర్భంగా ప్ర‌త్యేకించి వారందరినీ స‌త్క‌రించే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. అందునా క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట ప‌డి ప‌ని చేసిన వ‌లంటీర్ల‌ను వారియ‌ర్స్ గా గుర్తించింది..రాష్ట్ర ప్ర‌భుత్వం.

ఈ మేర‌కు ప‌ది వేల నుంచీ 30 వేల వ‌ర‌కూ సేవా మిత్ర‌,సేవా పుర‌స్కార్, సేవా వ‌జ్ర పేరుతో రాష్ట్రంలో ఉన్న వ‌లంటీర్ లు అందరిని స‌త్క‌రించింది. ఈ మేర‌కు మంత్రి బొత్స స్వంత ఊరు విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో ఆ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టింది…జిల్లా యంత్రాంగం.

అయితే నిన్న ఒక్క‌రోజే క‌రోనా సెకండ్ పుణ్య‌మా జిల్లా లో 197 కేసులు న‌మోదు అయ్యాయి. అయితే ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అందునా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్య‌క్ర‌మంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన స‌భ‌కు ఎన్ని జాగ్ర‌త్త‌లు  తీసుకోవాలి?

క‌రోనా సెకండ్ వేవ్ కు సంబంధించి ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాలి?  ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ పెట్టుకోవాల‌ని ఓ వైపు జిల్లా యంత్రాంగం చెబుతూనే..స‌భా ప్రాంగ‌ణం మొద‌ట్లో  శానిటైజ‌ర్ వినియోగంతో పాటు మాస్క్ ల‌ను కూడా పంపిణీ చేసారు…జిల్లా యంత్రాంగం.

కాని స‌భ ప్రాంగణంలో అడుగు పెట్టిన ఏ వ‌లంటీర్ మాస్క్ ధ‌రించే లేదు.స‌రి క‌దా అధిక సంఖ్య‌లో వ‌లంటీర్లు కూడా హాజ‌ర‌య్యారు.

ఈ ప‌రిస్థితిలో..ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ త‌ప్ప‌ని స‌రిగా ద‌రించాల‌ని.కాని ఈ ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో  ఏ ఒక్క‌రూ  మాస్క్ ద‌రించ‌కుండా  హాజ‌ర‌వ‌డం దేనికి సంకేతం.

Related posts

జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే!..

Satyam NEWS

రిక్వెస్ట్: తీసుకున్నరుణాలన్నీవందశాతం తిరిగి చెల్లిస్తా

Satyam NEWS

కోలుకుంటున్న సినీ నటుడు శరత్ బాబు

Bhavani

Leave a Comment