విజయనగరం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశానికి కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ప్రతీ రెండు నెలలకోకసారి నిర్వహించడం పరిపాటి. దీంతో విజయనగరం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న జెడ్పీ సమావేశమందిరంలో జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ స్థాయి సంఘ సమావేశంలో వ్యవసాయ,రెవిన్యూ,ఫించన్లు తదితర అంశాలపై వాటిని తాలూ అభివృద్ది పనులు, లబ్దిదారులకు అందిస్తున్న పథకాలపై సభ్యులడిగిన ప్రశ్నలకు జెడ్పీ చైర్మన్ అద్యక్షతన అధికారులు సమాధానం చెప్పారు. విశేషం ఏంటంటే జెడ్పీటీసీ అదేనండీ ప్రాదేశిక సభ్యులందరూ హాజరైనప్పటికీ ఎమ్మెల్యే,ఎంపీలు రాకపోవడంతో సమావేశం మందిరంలో వారికి కేటాయించిన సీట్లు,ఏయే సీట్లలో ఏ ఎమ్మెల్యే కూర్చోవాలో గుర్తెరిగేలా పేర్లతో రాసిన బోర్టులు మాత్రమే దర్శనం ఇచ్చినట్టు అలాగే వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. మరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మాత్రమే తామంతా హాజరు కావాలని అనుకున్నారా..? లేదా నిర్ణయించుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
previous post
next post