33.2 C
Hyderabad
April 25, 2024 23: 22 PM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ మసీదుల్లో తాండవిస్తున్న నిశ్శబ్దం

darul shafa

హైదరాబాద్ లో మసీదులు మూత పడ్డాయి. ప్రముఖ మసీదులైన మల్లేపల్లి మసీదు, దారుల్ షఫా, సిద్ధి యంబర్ బజార్ లోని మసీదు లు తాళాలు వేసి ఉన్నాయి. మసీదుల్లో ప్రార్ధనలు నిలిచిపోయి ఇది మూడో శుక్రవారం. హైదరాబాద్ లోని చిన్న మసీదులు చాలా వరకూ రెడ్ జోన్ లలో ఉన్నాయి.

రెడ్ జోన్లు ఉన్నచోట కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసి వాటిలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. కంటైన్ మెంట్ జోన్ లోని నివాసులు ఇళ్ల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. నిత్యావసరాలను వారికి ఇంటి వద్దకే అందిస్తారు. ఈ నేపథ్యంలో ముస్లింలు ఇళ్ల లోనే ప్రార్ధనలు చేసుకుంటున్నారు.

ముస్లిం మత పెద్దలు కూడా ఇదే విషయాన్ని వారికి స్పష్టం చేస్తున్నారు. పాతబస్తీలో హిందూ దేవాలయాలు చాలా వరకూ మూతపడిపోయాయి. అక్కడ నిత్య పూజలు జరిపేందుకు కూడా వీలు లేకుండా పోయింది.

Related posts

వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలి

Satyam NEWS

ఆలయాల్లో హుండీ చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్టు

Satyam NEWS

సి ఎం జగన్ ఆశయాలకు ప్రతిబింబం కావాలి

Satyam NEWS

Leave a Comment