31.2 C
Hyderabad
April 19, 2024 06: 21 AM
Slider ప్రత్యేకం

76 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా ఉలుకుపలుకు లేదు

#bopparajuvenkateswarlu

రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక కర్షక, కాంట్రాక్టు  ఉద్యోగులు 76 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేకపోవడం దుర్మార్గమని ఏ పి జె ఏ సి అమరావతి అధ్యక్షులు బొప్పారాజు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఏలూరులోని జిల్లా రెవిన్యూ భవన్ లో ఈ నెల 27 వ తేదీన నిర్వహించనున్న 3 వ ప్రాంతీయ సదస్సు నిర్వహణ పై బొప్పరాజు కృష్ణా, ఏలూరు జిల్లాల అమరావతి జె ఏ సి నాయకుల తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భం గా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏలూరు మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో ఈ నెల 27 న జరిగే  3వ ప్రాంతీయ అమరావతి జె ఏ సి సదస్సుకు ఉద్యోగులు కదం తొక్కి కదలి రావాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని ఉగ్ర సింహాల్లా ఉరకలెత్తి తరలి రావాలని కోరారు. సమస్యల పరిష్కరించేంత వరకు ప్రభుత్వం పై పోరాడేందుకు ఉద్యోగుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలన్నదే ఏ పి జె ఏ సి అమరావతి ప్రాంతీయ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు.

పాత 4 డి ఏ లు ఇప్పటివరకు చెల్లించలేదని, కొత్త డి ఏ లు మూడింటికి ఒక్కటి మాత్రమే చెల్లించారని పి ఆర్ సి ఏరియర్స్ కింద రావాల్సిన కోట్లాది రూపాయలు విడుదల చేయలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పై రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల చైర్మన్ ల తో జరిగిన టెలీకాన్ఫరెన్స్ ల వల్ల కూడా  ఉద్యోగులకు ఒరిగిందేమిలేదని బొప్పరాజు విమర్శించారు.

Related posts

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

కల్వకుర్తిలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Satyam NEWS

అభిమానులకు నందమూరి బాలకృష్ణ గ్రీటింగ్స్

Satyam NEWS

Leave a Comment