కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ నిలిపివేయడం తో భారతదేశంపై ప్రతీకారం తీసుకుంటామని ఎలానుకుంటున్నారని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దస్థాయిలో తాము లేమని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందని మలేషియా పశ్చిమ కోస్తా ప్రంతంలోని లాంగ్‌కావి దీపంలో మీడియాతో మాట్లాడుతూ మహతిర్ అన్నారు.