పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ కాండపై హిందువులంతా పునరాలోచించాలంటూ విజయనగరంలో హిందూ సంఘాలన్నీ గళమెత్తాయి. ఆ దేశంలో హిందూ సంస్క్రతిపై పోరాడుతున్న ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్తలను ఎదగనీయకుండా కొన్ని సంఘాలు దాడులు, అపహరణలకు పాల్పడటం సిగ్గు చేటని హిందూ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ మేరకు విజయనగరంలో కోట జంక్షన్ నుంచీ మూడు లాంతర్లు, గంటస్థంభం వరకు ఐక్యతా ర్యాలీ పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ, ఏబీవీపీ, వీహెచ్పీ హిందువుల ఐక్యత వర్దిల్లాలి అంటూ సామూహికంగా ర్యాలీ నిర్వహించాయి.
ఈ సందర్బంగా ఆర్.ఎస్.ఎస్, విభాగ్ సంఘ ఛాలక్ కృష్ణం రాజు మాట్లాడుతూ ఆదేశంలో హిందూ సంస్క్రతికై పోరాడుతున్న ఇస్కాన్ కు చెందిన వ్యక్తిపై దాడులు జరగడం ఆపై ఆ కేసును వాదిస్తున్న లాయర్ ను అతి కిరాతకంగా అంతమొందించడం హేయమైన చర్య అని అన్నారు. దీనకంతటికీ వెనక ఓ ముస్లిం సంస్త ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో హిందువులంతా ఏకం కావల్సిన సమయం ఏర్పడిందన్నారు. అందు కోసమే విజయనగరంలో హిందూ సంఘాలన్నీ ఏకత్రాటిపైకి వచ్చి ర్యాలీ నిర్వహించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ నేతలు గాడేపల్లి సుందర్, ఆర్.ఎస్.ఎస్ నేతలు దేశరాజు అప్పారావు, ముని కేశవ్, గీతారెడ్డి, వెంకటపతిరాజు,మణికంఠ తదితరలు పాల్గొన్నారు.