27.7 C
Hyderabad
April 20, 2024 01: 45 AM
Slider శ్రీకాకుళం

పండగ పూట జీతం లేని సమగ్ర శిక్ష సిబ్బంది

sarva siksha

అరకొర జీతంతో అర్ధాకలితో బతుకుతున్న సమగ్ర శిక్ష సిబ్బందిని అధికారులు పండుగ పూట పస్తులు ఉంచారు. జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను మళ్లించి చిరుద్యోగుల కడుపుకొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ కేటగిరీల్లో 2800 మంది సమగ్ర శిక్ష సిబ్బంది పని చేస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, కేజీబీవీ ఇంటర్మీడిట్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు ఈ క్యాటగిరిలో వస్తారు.

వీరితో బాటు మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎం.ఐ.ఎస్. కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, సమగ్ర శిక్ష ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ లు, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటి విభాగంలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది కూడా ఇదే క్యాటగిరిలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పొరుగు సేవల లో పనిచేస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, నైట్ వాచ్ మెన్, వంట పని వారు, స్వీపర్లు, ఇలా ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్థులు ఉన్నారు.

వీరందరికి పది వేల రూపాయల లోపు జీతమే వస్తుందని అదీ కూడా ఐదు నెలల నుంచి చెల్లించడం లేదని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి గుండబాల మోహన్ తెలిపారు. సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న వారికి సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్ నెంబరు ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యంగా ఉందని ఆయన అన్నారు. ఈ అకౌంట్ లో జీతాలు పడకపోవడంతో పండగ పూట సమగ్ర శిక్ష కుటుంబాల్లో ఆకలితో అలమటించారని మోహన్ తెలిపారు.

సమగ్ర శిక్ష లో పని చేస్తున్న మహిళలు బంగారు పుస్తెలు అమ్ముకొని, తాకట్టు పెట్టి పండుగ చేసుకున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సాధ్యమైనంత త్వరలో వీరికి రావలసిన జీత బకాయిలు ఇప్పించాలని ఆయన కోరారు.

Related posts

జగన్ పాలన లో సంక్షోభంలో పడ్డ సంక్షేమం

Satyam NEWS

వాషింగ్టన్ డీసీ లో టీడీఎఫ్ సమావేశం ముగింపు

Satyam NEWS

డెవెలప్మెంట్ టైం: పట్టణ అభివృద్ధికి నిధులుఇవ్వండి

Satyam NEWS

Leave a Comment