చందమామపై దిగే సమయంలో కట్ అయిన విక్రమ్ ల్యాండర్ లింక్ ఎంత ప్రయత్నించినా పునరుద్ధరించలేకపోతున్నారు. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ను స్పందించేలా చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు నాసా శాస్త్రవేత్తలు డీప్ స్పేస్ యాంటెన్నాలతో ప్రయత్నించినా ల్యాండర్ నుంచీ ఎలాంటి సిగ్నల్సూ రాలేదు. ఇప్పటికే ల్యాండర్ దిగి దాదాపు వారం అవ్వడంతో దానిపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నట్లే కనిపిస్తోంది. గంటలు గడిచే కొద్దీ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టే ప్రక్రియ మరింత కష్టం అవుతూ ఉంటుంది. ఇందుకు కారణం ల్యాండర్‌లో ఉన్న బ్యాటరీల పవర్ అంతకంతకూ తగ్గిపోతూ ఉండటమే. మనం మన మొబైల్ ఫోన్ వాడినా వాడకపోయినా అందులో బ్యాటరీ పవర్ అంతకంతకూ తగ్గుతూనే ఉంటుంది కదా అలాగే విక్రమ్ ల్యాండర్‌కి అమర్చిన బ్యాటరీల్లో పవర్ కూడా అంతకంతకూ తగ్గిపోతూ ఉంటుంది. తిరిగి వాటిని రీఛార్జ్ చెయ్యాలంటే అందుకు సోలార్ పవర్ కావాలి. సోలార్ పవర్‌ను విక్రమ్ ల్యాండర్ ఉపయోగించుకోవాలంటే దానికి ఇస్రో శాస్త్రవేత్తలు పంపుతున్న సిగ్నల్స్ అందాలి. ఆ సిగ్నల్స్‌కి అంది విక్రమ్ స్పందించాలి. అప్పుడు మాత్రమే సోలార్ పవర్ వాడుకునేందుకు వీలవుతుంది. కానీ సిగ్నల్స్ అందుకోకపోవడంతో పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
previous post