36.2 C
Hyderabad
April 25, 2024 22: 30 PM
Slider ముఖ్యంశాలు

Tragedy: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా

#MGMHospital

వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా సోకింది. అక్కడ పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి డాక్టర్ల వరకూ దాదాపుగా అందరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అధికారికంగా ఎవరూ లెక్కలు చెప్పడం లేదు కానీ మొత్తం డాక్టర్లతో కలిపి 400 మంది వరకూ అక్కడ సిబ్బంది పని చేస్తుంటారు.

అనధికారిక లెక్కల ప్రకారం 136 మంది వరకూ కరోనా పాజిటీవ్ వచ్చింది. మరో 200 మంది వరకూ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రతిష్టాత్మక ఎంజిఎం ఆసుపత్రి లోనే ఈ దుస్థితి ఉంటే ఇక తెలంగాణలోని మిగిలిన వైద్య శాలల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కనీసం పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా ఇచ్చే నాధుడు లేకుండా పోయాడు. రోగులకు మందుల కొరత వైద్యులకు, ఇతర సిబ్బందికి పిపిఇ కిట్ల కొరత. కేవలం మాస్కులు పెట్టుకుని కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన దారుణమైన పరిస్థితులు ఎంజిఎం లో నెలకొని ఉన్నాయి.

ఎంజిఎం మార్చురీలో శవాలు పేరుకుపోవడం, వాటి దుర్వాసన వ్యాప్తి చెందడంతో దాదాపు 9 శవాలను తగులబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఏ స్మశాన వాటికలో కూడా అనుమతించకపోతేపోవడంతో ఎంజిఎం పరిధిలోని పోతనా నగర్ స్మశాన వాటికలోనే ఆ శవాలను దహనం చేశారు.

అప్పటి నుంచి ఎంజిఎంకు రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కరోనా రోగుల్ని పరీక్షించాలంటే డాక్టర్లతో సహా అందరూ భయపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ఎక్కడా ఏవరికి ఇబ్బంది రానివ్వమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతుంటారు. వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా చెబుతుంటారు.

అయితే ఎంజిఎంలో ఇలాంటివి ఏమీ అమలు జరగడం లేదు.

హైదరాబాద్ లోని ప్రభుత్వాసుపత్రుల తర్వాత ఆ స్థాయిలో పెద్ది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి. ఉత్తర తెలంగాణ జిల్లాలకే కాకుండా ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల్లో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పెద్దదిక్కు ఎంజీఎం ఆసుపత్రి. వేయిపడకల సామర్థ్యం, కోవిడ్ 19 రోగుల కోసం 200 పడకలు దీని ప్రత్యేకత.

అదే సమయంలో పదివేల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ కరోనా రోగులకు చికిత్స అందించడాన్ని పక్కనబెడితే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఆస్పత్రి 136 మంది సిబ్బందికి పైగా కరోనా సోకడంతో ఎంజీఎంలో వైద్యానికి మరింత కొరత ఏర్పడింది. సగం వైద్య సిబ్బందితో నెట్టుకువస్తున్నా కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న వేళ సిబ్బంది కొరత, పరికరాల కొరతతో ఎంజీఎం ఆసుపత్రి ఆగమాగం అవుతోంది. 

సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేయడం, ఆయన స్థానంలో సీనియర్ వైద్యులు ఆర్థోపెడిక్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్ రావుకు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా వెనకాల నిధుల దుర్వినియోగంతో పాటు, రాజకీయ ఒత్తిళ్లు వున్నాయనే ఆరోపణలు విమర్శలు కూడా వున్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే డ్యూటీల సంగతి దేవుడెరుగని, ఇంటిదగ్గర ఇరుగుపొరుగు తమను వెలివేసినట్లు చూస్తున్నారని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ప్రాణాలకు తెగించి  వైద్యం చేస్తాం… కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వైద్యం చేయమంటే ఎలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

కోట్ల రూపాయల నిధులు ఎంజీఎం డెవలప్మెంట్ కు ఖర్చు పెడుతున్నామని చెబుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోకపోవడం సిగ్గుచేటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఎంజిఎం కరోనా నుంచి కోలుకుంటుందా? కరోనాతో మరణిస్తుందా అనేది వేచి చూడాలి.   

Related posts

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

Satyam NEWS

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి గురుమూర్తి

Satyam NEWS

రాయదుర్గంలో హోరేత్తిన వాల్మీకుల నిరసన 

Satyam NEWS

Leave a Comment