37.2 C
Hyderabad
March 29, 2024 17: 46 PM
Slider శ్రీకాకుళం

అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి విద్యార్థుల కావలెను

#AmbedkarUniversity

కరెక్టే చదివారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి విద్యార్ధులే కావాలి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు లేక వెలవెలపోతున్నది.

చాలా విభాగాల్లో ఈ ఏడాది కనీసం 20% కూడా ప్రవేశాలు జరగలేదు. యూనివర్సిటీ నిర్వహించిన కోర్సులపై విద్యార్ధులు అయిష్టత ప్రదర్శించడమే ముఖ్య కారణం.

ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, ఇంగ్లీషు, తెలుగు, కామర్స్, గణితం, భౌతిక శాస్త్రం, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, జర్నలిజం, యోగా పిజి కోర్సుల్లో మెజారిటీ సీట్లు ఖాళీ గా  ఉన్నాయి.

బయోటెక్నాలజీ, జియాలజీ, రసాయనిక శాస్త్రం కోర్సుల్లో కూడా విద్యార్థులు చేరటం లేదు.

దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులు లో చాలా మందికి విద్యా అర్హతలు లేకపోవడమని చెబుతున్నారు.

యూనివర్సిటీ డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకట్రావుఈ సమస్యపై దృష్టి నిలపాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related posts

లోకేష్ ను కలిసి సమస్యలను వివరించిన బీమా మిత్రలు

Bhavani

సుదీర్ఘమైన సేవలతో శాఖకు వెన్నుద‌న్నై నిలిచారు

Satyam NEWS

కూతురిపై క‌న్న‌తండ్రి లైంగిక దాడి: ప‌దేళ్లు జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా

Satyam NEWS

Leave a Comment