32.2 C
Hyderabad
April 20, 2024 19: 43 PM
Slider సంపాదకీయం

ఉన్నదంతా ఊడ్చేశారు… జీతాలు ఈ నెల కూడా లేటే

#Y S Jagan

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు ఇంకా అందరికీ పూర్తిస్థాయిలో  కాకుండా అరకొరగా అందాయి. సచివాలయం ఉద్యోగులు, హెచ్ఓడీ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులకు మాత్రం జీతాలు, పెన్షన్లు అందినట్లు చెబుతున్నారు.

ప్రతి సారీ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నందున ఈ సారి ఒకటో తేదీకల్లా జీతాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అయితే ఉన్నదంతా సామాజిక పెన్షన్లకు ఊడ్చి పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగిపోయింది.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు సుమారు 5 లక్షల మంది ఉండగా మరో 3 లక్షల మంది పెన్షనర్లు వున్నారు. వీరందరికి ప్రతినెలా సుమారు రూ.8వేల కోట్లు చెల్లించాల్సిఉంది. గతనెల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అయింది.

అయితే ఈనెల ప్రస్తుతం ఖజానాలో అందుబాటులో ఉన్నంత వరకూ జీతాలు జమ చేస్తూ వస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లాంటి మార్గాలన్నీ ఇప్పటికే ప్రభుత్వం వినియోగించుకుంది.

ఈ క్రమంలో అదనపు అప్పుల కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద ప్రభుత్వం బాండ్లు వేలం వేసి రుణాలు సేకరిస్తుంది.

అయితే దానికి పరిమితులు ఉంటాయి. వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏపీ సర్కార్ దాదాపుగా ప్రతీ మంగళవారం వాడుకుంటోంది. అవి వస్తే జీతాలకు సరిపడా నిధులు వస్తాయి.

మంగళవారం.. బాండ్ల వేలం వేసి నిధులు సమీకరిస్తే.. బుధవారానికి నిధులు సర్దుబాటు అవుతాయి. అప్పుడు అందరికీ జీతాలు, పెన్షన్లు సర్దుబాటయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంతగా ఉద్యోగులు బాధ పడుతున్నా కూడా ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం కిమ్మనడం లేదు. పైగా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ, ఎవరైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే వారినే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related posts

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Satyam NEWS

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలి

Satyam NEWS

భారత్ పాక్ మధ్య కమాండర్ స్థాయి సరిహద్దు చర్చలు

Satyam NEWS

Leave a Comment