Slider ఆదిలాబాద్

దశాబ్ది ఉత్సవాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.సోమవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.105 కోట్లతో  జూన్ 2 నుండి జరిపే ఉత్సవాలు బిఆర్ఎస్ ఉత్సవాలుగా అభివర్ణించిన ఆయన, కేసీఆర్ అబద్దాలను నిజం చేసే కుట్రలో భాగంగానే దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఏం సాధించారని తెలంగాణ సంబరాలు జరుపుతున్నారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్న ఆయన అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చలేని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని పల్లెల్లో సంబరాలు జరుపుతారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం,లీకేజీకి సూత్రధారులైన కమిషన్ చైర్మన్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ రద్దు చేసిన తర్వాతే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించాలన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై,రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి,బిఆర్ఎస్ రహస్య కూటమితో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలును అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగాన్ని  అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గత 15 ఏళ్లు హైదరాబాద్ లో నిర్మిస్తున్న హజ్ హౌస్ ను ఎందుకు పూర్తి చేయలేదన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, జిల్లా కార్యదర్శి దుర్గం ప్రవీణ్,స సీనియర్ నాయకులు షేక్ చాంద్, సర్పంచ్ అన్సార్ హుస్సేన్, కాగజనగర్ పట్టణ అధ్యక్షుడు నక్క మనోహర్, నియోజకవర్గ మహిళా అధ్యక్హురాలు సిడెం జ్యోతి, షాకీర్ అహ్మద్, శ్రీనివాస్,శంకర్, శోభన్,అరున్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

మణిపూర్‌ ఘటనపై ప్రధాని సీరియస్‌

Bhavani

మళ్లీ రాహుల్ గాంధీనే బాధ్యత మోయక తప్పదా?

Satyam NEWS

Leave a Comment