32.7 C
Hyderabad
March 29, 2024 11: 33 AM
Slider నిజామాబాద్

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

hanmanth shinde

బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల వ్యాపార సముదాయాలను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యాపార సంస్థ వద్ద నీరు శానిటేషన్ చేతులు శుభ్రపరచుకోవడానికి సౌకర్యం కల్పించాలన్నారు.

ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేందుకు చొరవ చూపాలని అత్యవసరమైతే తప్ప బయటకు రా రాదన్నారు. బయటకు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని త్వరగా పనులు ముగించుకుని తమ ఇళకు వెళ్లిపోవాలన్నారు.

ఈ మహమ్మారి పట్ల ఎవరైనా అశ్రద్ద వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ప్రకటించాయి. కావున మనమందరం ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. దుకాణ యజమానులు దూరంగానే ఉండి  సరుకులు ఇవ్వాలన్నారు.

Related posts

మోడీ విధానాలు త్రిప్పి కొట్టెందుకే….27 భారత్ బంద్….!

Satyam NEWS

కరోనా వ్యాక్సినేషన్: రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్

Satyam NEWS

లాక్ డౌన్ పాటిస్తున్న తరుణంలో విహెచ్ పి సేవలు

Satyam NEWS

Leave a Comment