కొల్లాపూర్ ప్రాంతంలో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల దగ్గర పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారు జాము నుండి పడిగాపులు కాస్తున్నారు. అయినా వారిని పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. ఈ సమస్య పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నాలు చేస్తున్నారు. రైతుల వారం రోజుల్లో వేరుశనగ విత్తనాలు వస్తాయని చెబుతూ ఎవరూ దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్ షో లతో రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పలుమార్లు మాట్లాడారు.
శుక్రవారం కొల్లాపూర్ ఆర్డిఓ కార్యాలయం ప్రారంభోత్సవానికి అదే విధంగా బతుకమ్మ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి వేరుశెనగ విత్తనాల గురించి ప్రస్తావన చేయలేదు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ఆయనకు వేరుశనగ విత్తనాల గురించి రైతులు పడుతున్న అవస్థలను గురించి చెప్పలేదు. కనీసం గుర్తు చేయలేదు. ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయానికి మంత్రి సింగిరెడ్డి వెళ్లారు.
జూపల్లి తో జన్మదిన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అక్కడ కూడా వేరుశనగ విత్తనాల అంశం పై మాట్లాడలేదు. చివరికి మంత్రి కాన్వాయ్ లోకి వెళుతున్నసమయంలో కొందరు విత్తనాల సమస్యను గుర్తు చేశారని తెలిసింది. కానీ ఆ అంశం గురించి మాట్లాడవద్దు అన్నారని తెలిసింది. ఇప్పటి వరకు కొల్లాపూర్ మండల వ్యవసాయ కార్యాలయానికి 2202 క్వింటాలు వేరు శెనగ విత్తనాలు అందాయి. పంపిణీ చేశారు. అస్సలు రావలసింది 8వెయ్యిల క్వీన్ టాలు.
ఏ మాత్రం సరిపోని విత్తనాలు రావడంతో రైతులతో బాటు వివిధ పార్టీలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇన్ని సమస్యలు జరుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చిన సంధర్భంగా రైతులకు హామీ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. కానీ ఆయన మాట్లాడలేదు. కనీసం ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఎమ్మెల్యే ఇప్పటి వరకు మంత్రి తో మాట్లాడాను ఆయన సానుకూలంగా స్పందించారు, వారం రోజుల్లో వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని పలుమార్లు తెలిపారు.
మరి మంత్రి నియోజకవర్గ ప్రాంతానికి వచ్చినప్పుడు మాట్లాడించవలసిన బాధ్యత ఉన్నది. మంత్రి ఎమ్మెల్యే లాగా నియోజకవర్గంలో వుండరు. మంత్రి వచ్చినప్పుడే సమస్యను ప్రజల ముందు చెప్పాలి. మాట్లాడించాలి. కానీ ఇక్కడ ఇలాంటి ది ఏమి జరగలేదు. వేరు శెనగ విత్తనాలపై మంత్రి మాట్లాడక పోవడంతో పలురకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవం సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతు సమస్యలపై వినతి పత్రం అందచేశారు. కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకులకు మంత్రి సమాధానం చెప్పాలి. కానీ ఆ అంశాన్ని కూడా ఆయన గుర్తించలేదు. ఇప్పుడు రైతులకు వేరుశనగ విత్తనాల సంగతి ఏంటని చర్చ జరుగుతుంది. ఎవ్వరి అవసరాలకు వారు రైతుల్ని వాడుకుంటున్నారు. కానీ రైతులకు సరైన న్యాయం చెయ్యలేక పోతున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి క్వశ్చన్ మార్కుగా మిగిలింది