37.2 C
Hyderabad
March 28, 2024 19: 22 PM
Slider మహబూబ్ నగర్

కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రతి శాఖలో అధికారిని నియమించాలి

#WanaparthyCollector

కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై జిల్లా వైద్య అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు కోవి డ్  వ్యాక్సిన్ కార్యక్రమంపై మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.  మున్సిపాలిటీలలో నోడల్ అధికారి గా కమిషనర్, పోలీసు శాఖలో నోడల్ అధికారి గా అడిషనల్ ఎస్పి   ఉంటారని ఆమె తెలిపారు. ప్రతి శాఖలో  నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, అదేవిధంగా వాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. నమోదు చేసుకొనుటకు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించిందని ఆమె అన్నారు. ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకున్న సందర్భంగా  పోలీసు శాఖను ఆమె అభినందించారు.

డి. ఎం. హెచ్. ఓ. శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు . మొదటి విడత వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు కూడా తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన తెలిపారు ప్రతి పీహెచ్ సి లలో అవగాహన కల్పించాలని ఐ ఈ సి మెటీరియల్ తయారు చేయాలని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

14 ఎకరాల్లో అద్భుత వనం

Sub Editor 2

ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ సభ్యత్వ నమోదు ఇంఛార్జుల నియామకం

Satyam NEWS

Leave a Comment