పార్లమెంటు సభ్యుడు అని కూడా చూడకుండా అరెస్టు చేసి ఒక క్రిమినల్ ను తిప్పినట్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన పోలీసులు తాము చేసిన పనిపై వివరణ ఇచ్చారు. ఎంపి జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారని అందుకే అరెస్టు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు పలువురు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ విజయరావు తెలిపారు.
జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారని దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయన్నారు. రాళ్ల దాడి చేసినవారిపై కేసులు నమోదు చేశామన్నారు. అసెంబ్లీ ముగిసే వరకు రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ విజయరావు వెల్లడించారు.