30.2 C
Hyderabad
September 28, 2023 14: 25 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

ka pal

క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తమ్ముడి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కేఏ పాల్ మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ హాజరు కాలేదు. దీంతో, పాల్ కు మహబూబ్‌నగర్‌ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పదస్థితిలో డేవిడ్ రాజు మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా పాల్ ఉన్నారు. పాల్ కు, డేవిడ్ రాజు కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకావాల్సిందిగా పాల్ కు అనేక సార్లు కోర్టు నోటీసులు పంపారు. అయినప్పటికీ పాల్ స్పందించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.

Related posts

జగనన్న కాలనీల్లో పేదలకు అన్యాయం చేస్తున్న అవినీతిపరులు

Satyam NEWS

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త

Satyam NEWS

ఇక్కడ జగనన్న బాణం అక్కడ జయమ్మ బాణం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!