30.7 C
Hyderabad
April 23, 2024 23: 48 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

షాక్ కొడుతున్నకరెంటు బిల్లులు

power-bill

కరెంటు బిల్లు చెల్లించారా? చెల్లించే ఉంటారు లేకపోతే అప్పులవాడు వేధించినట్లు మనల్ని కరెంటోళ్లు వేధించి కరెక్టుగా రెండు మూడు రోజుల సమయం కూడా ఇవ్వకుండానే ఫీజు పీక్కుని వెళ్లిపోతాడు. కరెంటు బిల్లలు ఎలా వసూలు చేస్తున్నారు అనే అంశంపై గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కీలక అంశాలు విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయాలు చూస్తే అమ్మా కరెంటోళ్లు మనల్ని ఇంత మోసం చేస్తున్నారా అనిపించక మానదు. అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం పై మరింత వివరణ ఇచ్చేందుకు సత్యం న్యూస్ ఈ ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 రోజులకు ఒక సారి మనకు మీటర్ రీడింగ్ తీసి బిల్లు ఇవ్వాలి. అయితే 40 రోజులకు కానీ వారు రావడం లేదు. ఈ విధంగా చేయడం వల్ల మనకు స్లాబ్ రేటు పెరిగిపోయి బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఉన్నరేట్ల ప్రకారం 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు చార్జీ వసూలు చేస్తున్నారు. బిల్లు వేసేందుకు 30 రోజులు దాటితే కరెంటు మరింత ఎక్కువ వినియోగించడం వల్ల యూనిట్లు పెరుగుతాయి. దీంతో మన స్లాబ్ రేటు మారిపోతున్నది. ఉదాహరణకు బిల్లు వేయడం 2రోజులు ఆలశ్యం అయిందనుకోండి  2 రోజులలో మనం  6 యూనిట్స్ కరెంటు వాడితే అది 106 యూ నిట్స్ కు చేరుతుంది. 101 యూనిట్స్ దాటితే యూనిట్ ధర 6.90 రూపాయలు. అంటే రెండు రోజులు బిల్లు వేయకపోవడం వల్ల మొదటి యూనిట్ నుంచి యూనిట్ కు 6.90 రూపాయల లెక్కప్రకారం కట్టాలి.అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది.. 100 యూనిట్స్ కు రూ. 390 రావాల్సింది 690 చెల్లిస్తున్నామన్నమాట, తేడా 690-390=300 అదనం. ఈ విధంగా ఎవరో ఒక్కరికికాదు చాలా మందికి ఇదే అనుభవం అయితే చాలా మందికి ఇది అర్ధం కాకపోవడం వల్ల ఏం చేయలేక కట్టేస్తున్నారు. బిల్లు వేసేవాడిని అడిగితే AE ని అడగమంటాడు. అక్కడ సమాధానం ఉండదు. ఇలా ఎందుకు జరుగుతున్నదీ అంటే కరెంటు సరఫరా చేసే సంస్థలు అతి తెలివిగా చేస్తున్న పని ఇది. దీనికి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోకపోవడంతో దోపిడి కొనసాగుతూనే ఉంది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలుసుకానీ ఎవరూ ఏం మాట్లాడరు. కరెంటు బిల్లులు రూపొందించడంలో రెండు విధానాలు ఉంటాయి. ఒకటి టెలి స్కోపిక్, రెండు నాన్ టెలిస్కోపిక్. ప్రస్తుతం తెలంగాణ లో నాన్ టెలిస్కోపిక్ విధానంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. అంటే 100 యూనిట్లు దాటితే స్లాబ్ మారుతుందన్నమాట. అలా స్లాబ్ మారడం 101వ యూనిట్ నుంచి కాకుండా ఒకటో యూనిట్ నుంచి కొత్త రేటు వర్తిస్తుంది. ఇదే ఇక్కడ వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయం. వాస్తవానికి టెలిస్కోపిక్ బిల్లింగ్ ఉండాలి. అంటే మొదటి యూనిట్ నుంచి 100 యూనిట్లకు ఒక రేటు ఉంటే 101 నుంచి 200 వరకూ, 201 నుంచి 300 యూనిట్ల వరకూ వేరు వేరు స్లాబ్ లు ఉంటే అవి అక్కడ నుంచి వర్తింప చేయాలి. అంతే కానీ 400 యూనిట్లు వాడితే ఆ స్లాబ్ రేట్ ను 1వ యూనిట్ నుంచి వర్తింప చేయడం ఏమిటి? కరెక్ట్ గా 30 రోజులకు బిల్లు వేసేంత సిబ్బంది లేరు. సాంకేతికతను వాడుకోరు. ప్రభుత్వ నిర్లక్షానికి విద్యుత్ వినియోగదారులు చెల్లిస్తున్న భారీ మూల్యం ఇది. ఈ మోసాన్ని అందరూ అర్ధం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. బిల్లలు టెలిస్కోపిక్ విధానంలోకి తీసుకురావాలి.

Related posts

మంత్రి పదవి ఇవ్వని సీఎం దిష్టి బొమ్మ దగ్ధం

Satyam NEWS

నిరుపేద కుటుంబానికి అండగా బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

గ్రీన్ ఈజ్ ద లైఫ్: మానవ మనుగడకు చెట్లే కీలకం

Satyam NEWS

Leave a Comment