32.2 C
Hyderabad
June 4, 2023 19: 23 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షంతో కల్లోలం

rains in ap

ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాల ముప్పు ముంచుకొచ్చింది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలక్రితం బెళగావిని వరదలు ముంచెత్తగా మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. మలప్రభ నదీ తీరంలో హెచ్చరికలు జారీ చేశారు. సుమారు ఆరేడు గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉన్నందున బెళగావి జిల్లాధికారి పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు. బెళగావి వ్యాప్తంగా వర్షంహోరుతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. సవదత్తి తాలూకాలోని నవిలుతీర్థ జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బెంగళూరులోనూ వర్షం హోరు తీవ్రంగా ఉంది.

Related posts

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

ఇక హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్-స్టాప్ విమానం

Satyam NEWS

కోత‌కు గురైన‌ అప్రోచ్ రోడ్: మంచిర్యాల నిర్మ‌ల్ మ‌ధ్య నిలిచిన రాకపోకలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!