32.2 C
Hyderabad
March 28, 2024 22: 01 PM
Slider ప్రపంచం

జీసస్:టాంజానియాలో తొక్కిసలాట 22 మంది మృతి

north tanzania church stampade 22 died

ఆదివారం సాయంత్రం ఉత్తర టాంజానియాలో ఘోరమైన సంఘటన జరిగింది.చర్చిలో బ్లెస్సెడ్ ఆయిల్ పేరుతొ స్వస్థత కూటములు నిర్వహిస్తున్నసందర్భంగా ప్రార్థనలకు పెద్ద ఎత్తున జనం హాజరు కాగా జీసస్ దీవెనలతో మంత్రించిన నూనె ను పారా బోసి దానిని తాకాలని తెలుపడం తో జనం నూనెను తాకడానికి ముందుకు వచ్చి నూనెలో జారీ పోగా వెనక ఉన్నవాళ్లు తొక్కుతూ ముందుకు వెళ్లడం తో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.మోషిలో జరిగిన ప్రార్థన సమావేశంలో వందలాది మంది ఆరాధకులు ఇందులో పాల్గొన్నారు.


కిలిమంజారో పర్వతం దిగువన గల వాలు ప్రాంతంలో తూర్పు ఆఫ్రికా దేశంలోని స్టేడియంలో జరిగిన ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు,ఈ కార్యక్రమాన్ని పాస్టర్ బెనిఫిక్ మావపోస నిర్వహించగా ఆయన్ని అక్కడి పోలీస్ లు అరెస్ట్ చేశారు.మృతుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నట్లు అనారోగ్యం తో ఉన్న చాలా మంది ప్రజలు ప్రార్థనలకు స్వస్థత కై వచ్చారని అక్కడి మీడియా తెలిపింది.మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశముందని వారు తెలిపారు.

Related posts

వివేకా హత్య కేసు బదిలీ ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చ

Murali Krishna

రెండు స్థానాల నుంచి తిరుగులేని శక్తిగా….

Satyam NEWS

మున్సిపాల్టీ లే అవుట్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment