36.2 C
Hyderabad
April 24, 2024 20: 28 PM
Slider తూర్పుగోదావరి

కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేసిన ప్రాథమిక పాఠశాలలు

#schools

గత అనుభవాల దుష్ట్యా ఇప్పటికీ మున్సిపల్ పాఠశాలలు  పాఠాలు నేర్చుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం ప్రాంతంలో  ఏ  ఒక్క పాఠశాలలోనూ  కోవిడ్  – 19 నిబంధనలు పాటించడం లేదు. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు కిక్కిరిసిన పాఠశాలల గదులు, పాఠశాలకు సరియిన గదులు లేక వున్నవాటి లోనే పిల్లలను కూర్చోబెడుతున్న పాఠశాల  ఉపాధ్యాయులు. 

ఒక్కొక్క బెంచ్ కి 4గురు లేదా 5గురు విద్యార్థులు, కొన్ని పాఠశాలల్లో ఐతే బెంచీలు  లేక  క్రింద నేల పైనే  కూర్చుంటున్నారు. ” నాడు — నేడు”  పాఠశాలలకు రంగులు ముస్తాబులకే పరిమితం అయింది.  విద్యార్థుల ఇక్కట్లు ప్రభుత్వానికి పట్టడం లేదు. 

విద్యార్థుల ఆరోగ్యం పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనుకోని సంఘటన  ఏదయినా జరిగితే దానికి బాధ్యత వహించేది ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు మేల్కోకపోతే బీజేపీ ఎస్సి మోర్చా తరపున అమలాపురం మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడి చేసామనిబీజేపీ ఎస్సి మోర్చా కోస్టల్ జోనల్ ఇంచార్జి దూరి రాజేష్  తెలిపారు.

Related posts

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే

Bhavani

వైద్య శిబిరాలు పేదలకు వరం: కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో కరోనా టెన్షన్

Satyam NEWS

Leave a Comment