నిర్భయ అప్పుడు కాదు ఇప్పుడు సిస్టమే గ్యాంగ్ రేప్ చేస్తుంది మొత్తానికి ఈ దేశం లో విధానమే గ్యాంగ్ రేప్ కు గురవుతుంది దయచేసి ఇది గమనించండి అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైంది. నేడు మన సిస్టమ్ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోంది.
నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని మీరు ఊహించగలరా మోదీ గారూ. పూర్ గర్ల్ అయిన నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.ఒకసారి కాదు నిర్భయ రెండు సార్లు రేప్ కు గురైందని అయన ఆవేదన వ్యక్తం చేయడం సంచలనం.